
అయితే జూలై 6న యూజీసీ జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు చట్టబద్ధత, రాజ్యాంగ ప్రామాణికతను విద్యార్థుల తరఫున న్యాయవాది ప్రశ్నించారు. అంతేకాదు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పలు వర్గాల నుంచి వచ్చిన పిటిషన్లపై విచారణ జరిపారు. విపత్తు నిర్వహణ చట్టం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- యూజీసీ మార్గదర్శకాలను పరిశీలించి సమాధానం ఇవ్వాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇంకా విద్యార్థులు పరీక్షలకు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులకు డిగ్రీ పట్టా రాదన్నారు. అది చట్టమని యూజీసీ తరఫున సుప్రీం కోర్టుకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించట్లేదంటూ అఫిడవిట్స్ దాఖలు చేశారు. అంతేకాదు డిగ్రీలు ఇచ్చే అధికారం యూజీసీకి ఉంటే రాష్ట్రాలు పరీక్షల్ని ఎలా రద్దు చేస్తాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా దీనిపై మాట్లాడారు.
అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించిన స్టేటస్‌పై ఇప్పటికే 818 విశ్వవిద్యాలయాల నుంచి వివరాలను యూజీసీ సేకరించింది. అందులో 121 డీమ్డ్, 291 ప్రైవేట్, 51 సెంట్రల్, 355 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 209 విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షల్ని నిర్వహించాయన్నారు. 603 విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయని తెలియజేశారు.