నిజానికి ఇంటర్మీడియట్లో కనీసం 40 మార్కులు వస్తే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కు అర్హత ఉంటుంది. కానీ కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ నిబంధనల సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక పదవతరగతి పరీక్షలు లేకుండానే గత ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి విద్యార్థులను ప్రమోట్ చేయడం జరిగింది. అయితే వీరందరికీ గత మార్చిలో కూడా ఫస్ట్ ఇయర్ కు సంబంధించి ఎగ్జామ్స్ లు కూడా నిర్వహించలేదు. కానీ ఆ తరువాత అక్టోబర్ నెలలో వీరందరికీ ఎగ్జామ్స్ పెట్టారు. కానీ ఇలా చేయడం వల్ల 49 శాతం మంది మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారట. ఈ విషయంపై విద్యార్థులలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.
అయితే కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థం కాకపోవడం వల్లే తాము పరీక్షలు సరిగ్గా రాలేకపోయానని తెలియజేశారు. మరికొంత మంది విద్యార్థులు బలవన్మరణాలకు కూడా పాల్పపడం జరిగింది. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని చేసింది. ఇక ఈ ఏడాది వీళ్ళందరూ ఏప్రిల్ నెలలో పరీక్షలు రాయవలసిన ఉంటుంది. ఇక ఫస్ట్ ఇయర్ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ మంది 40 శాతం మార్కులను సాధించడమే కష్టంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అందుకోసమే 35 మార్కుల తోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా సీట్లు పొందేందుకు ఈ అవకాశాన్ని కల్పించాలని తాజా నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యా మండలి అధికారులు త్వరలోనే ఒక ప్రకటన చేసే వీలుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి