కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే ఇంటర్మీడియట్ పూర్తి అయిన విద్యార్థి డిగ్రీ చదవాలి అనుకున్నట్లయితే ఒక వేళ విద్యార్థి ఒక మంచి పేరు ఉన్న కాలేజీ లో సీట్ దక్కించుకోవాలి అంటే ముందుగా అతను ఆ కాలేజీ లో సీట్ కోసం అప్లై చేసుకోవాలి. ఫలితాలు వచ్చాక అతని మార్కులకు బట్టి ఆ కాలేజీలో సీటు రావచ్చు , రాకపోవచ్చు. ఇక ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఇదే పద్ధతి ఉండేది. ఒక విద్యార్థి ప్రభుత్వ కాలేజీ లో చదవాలి అనుకున్నట్లయితే అతను ముందుగా ఆ కాలేజీ లో చదవడం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అతనికి వచ్చిన మార్కులకు ఆ కాలేజీ లో సీటు రావచ్చు , రాకపోవచ్చు.

ఒక వేళ తనకు మంచి మార్కులు వచ్చినట్లయితే అతనికి ఆ కాలేజీ లో సీట్ వస్తుంది. లేదా అతని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు అనేక మంది ఆ కాలేజీ లో సీట్ కోసం అప్లై చేసినట్లయితే అతనికి ఆ కాలేజీలో సీటు రాకపోవచ్చు. ఇలా పద్ధతి అంతా నడుస్తూ ఉండేది. ఈ పద్ధతి అంతా కూడా దాదాపు కాలేజీ స్టార్ట్ అయ్యే లోపే జరిగిపోయేది. దాదాపు విద్యార్థులు ఎవరు కూడా క్లాసులు మిస్ అయ్యవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఇప్పటికే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయ్యే చాలా కాలం అవుతుంది. డిగ్రీ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి తాజాగా షెడ్యూల్ విడుదల అయింది. దానితో అనేక మంది ఇప్పటికే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతుంది. మరికొన్ని రోజుల్లోనే సెమ్ స్టార్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి.

ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ కాలేజీలో చేరితే వారు ఎప్పుడు చదువుకోవాలి , ఎగ్జామ్స్ కి ఎప్పుడు ప్రిపేర్ కావాలి. ఒక వేళ వారు ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్స్ రాసినట్లయితే వారికి మంచి మార్కులు రావు. భవిష్యత్తు లో ఆ మార్కులు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. డిగ్రీ యాజమాన్యం ఇకపై నుండి అయినా డిగ్రీ క్లాసులు పెద్దగా స్టార్ట్ కాక ముందే అన్ని రకాల సీట్లను భర్తీ చేస్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: