ఫిబ్రవరి నుంచి
పసిడి ధరలు కిందకు వస్తున్నాయి..బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు
పసిడి ధరలు బ్రేకులు పడ్డాయి.. వరుసగా కిందకు దిగి వస్తున్నాయి. ఇకపోతే ఈరోజు కూడా నిన్నటి తో పోలిస్తే స్వల్పంగా కిందకు దిగి వచ్చింది. మహిళలు దీనిని శుభసూచంగా భావిస్తున్నారు. గత ఐదు రోజులుగా బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం పెరిగినా కూడా జాతీయ
మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం అని చెప్పాలి.ఈరోజు పలుకుతున్న రేట్లకు
మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన,
ఇండియన్ మార్కెట్ లో తగ్గింది. ఇకపోతే
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరల విషయానికొస్తే.. ఈ వారం మొత్తానికి చూస్తే ..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,230 క్షీణించింది. దీంతో రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,060 పడిపోయింది. దీంతో ధర రూ.43,750కు తగ్గింది. ఈరోజు రెండు కలిపి కేవలం రూ.10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,720 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 43,740 కి పడింది.
బంగారం ధరతగ్గితే
వెండి కూడా దారిలో నడిచింది. నిన్న
వెండి విషయానికొస్తే..72000 ఉంది. మరి ఈరోజు ధర చూస్తే ఇంకాస్త కిందకి దిగింది. ఈరోజు రెండు వందలు తగ్గి 71800 చేరింది.
వెండి వస్తువులు పై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ధర కూడా ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.33 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.98 శాతం పెరుగుదలతో 27.01 డాలర్లకు పెరిగింది. ఈరోజు నుంచి బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి.