
ప్రతి రోజూ తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే లేస్తూనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు నిదానంగా కొంచెం కొంచెం తాగాలి. దాని వలన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగి, ముఖము జిడ్డు తొలగి, అందంగా తయారవుతుంది.
ఉదయాన్నే టిఫిన్ కంటే ముందు 4,5 నానబెట్టిన బాదాం కానీ, లేదా ఏదయినా పండుకానీ తినాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తొందరగా శక్తి వస్తుంది. అందువల్లరోజూవారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ కి కూడా చోటు ఇవ్వడం వల్ల ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపిస్తారు.
మార్నింగ్ కానీ, ఈవెనింగ్ కానీ వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి.రోజూ అరగంట సేపు అయినా వాకింగ్ చేయాలి.ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది.రోజు వ్యాయామం చేయడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు.
ఉదయం లేచిన తర్వాత తప్పనిసరిగా ఒక 10 నిముషాలైన ధ్యానం చేయడం అలవర్చుకోవాలి.ధ్యానం మూలాన ముఖము కాంతి వంతంగా తయారవుతుంది.ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయి ముడతలు తగ్గుతాయి.
ఆరోగ్యకరమైన టిఫిన్ శరీరానికి చాలా అవసరం. కనుక ఉదయం టిఫిన్లో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకువాలి. ఏ పూట తిన్న తినకపోయినా ఉదయాన్నే అల్పాహారం మాత్రం తినాలి. అదే మనకు రోజంతా పని చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరం ఫిట్‌గా ఉంటుంది. చర్మం బిగుతుగా తయారవుతుంది. ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేయడం వల్ల మన చర్మం అందంగా తయారై, నిత్య యవ్వనంగా కనిపిస్తుంది.