ఈ మధ్య కాలంలో కిడ్నీల్లో రాళ్లతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సమయానికి తినకపోవడం, నీరు సరిగ్గా తాగకపోవడం, జీవన శైలి, పోషకాలు లేని ఆహారం, ఇతర కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. కిడ్నీలో రాళ్లు తీవ్ర్రమైన నొప్పిని కలుగజేస్తాయి. పలు పరిశోధనల్లో ప్రతి 20 మందిలో ఒకరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడతారని తేలింది. 


 
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కిడ్నీల్లో రాళ్ల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు తొలగించడానికి మాత్రమే సర్జరీ అవసరం. తగినంత నీళ్లు తాగితే చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లు వాటంతట అవే కరిగిపోతాయి. నీటిలో మెంతులు నానబెట్టి ప్రతిరోజు తాగితే రాళ్లు కరిగిపోతాయి. అరటి చెట్టు బెరడును తీసుకొని జ్యూస్ లా చేసి తాగితే మూత్ర విసర్జన ద్వారా కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయి. 
 


ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా నీటిలో కలుపుకుని ప్రతిరోజూ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. కొత్తిమీర ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 10 నిమిషాలు నీటిలో మరిగించి రోజూ తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. క్యాల్షియం సిట్రేట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నా రాళ్లు వాటంతట అవే కరుగుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవారు టమోటా, చిక్కుడు, సోయా, పాలకూర తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: