
బరువు తగ్గడానికి మిరియాలు బాగా పనిచేస్తాయి. మిరియాలను పొడి చేసుకుని రోజు ఉదయం పరగడుపున నీటితో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
మిరియాల పొడిని వీటితో కలిపి ఉదయము పరగడుపున తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కణాలను పోషించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మిరియాల పొడిని నీటితో కలిపి ఖాళీ కడుపుతో సేవించడం వల్ల కణజాలాలకు పోషకాలను అందించడమే కాకుండా తేమగా ఉండటానికి ఉపయోగపడతాయి.అంతేకాకుండా శరీర కణజాలాలను నిర్జలీకరణం,అలసట,పొడి చర్మము నుండి కాపాడుతుంది.
మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు మిరియాల పొడిని వేడినీళ్లతో కలిపి తాగడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది.ఫైల్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
చిటికెడు మిరియాల పొడిని నీటితో కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న వ్యర్టాలు బయటికి పోతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.