వేసవికాలంలో పుచ్చకాయలు విరివిగా దొరుకుతాయి. ఇవి తినడం వల్ల దాహం తీర్చడమే కాకుండా, వేసవి తాపము నుంచి శరీరాన్ని కాపాడుతుంది. పుచ్చకాయ  తినడం వల్ల కిడ్నీలకు చాలా మంచిది. అంతేకాకుండా మూత్రపిండాల్లో ఉండే మలినాలను తొలగించి, కిడ్నీ సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వేసవికాలంలో శరీరంలోని మలినాలను తొలగించుకోవాలంటే పుచ్చకాయల మొక్కలను రోజూ రెండు కప్పులు తీసుకోవాలి. పుచ్చకాయ తినడం వల్ల  ఆరోగ్యానికి జరిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 పుచ్చకాయలోని ఎరుపు బాగాన్ని మాత్రమే మనం తింటాం. కానీ తెలుపు భాగం తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా  భాగమును పురుషులు తినడం వల్ల వీర్య వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వీర్యంలో ఏ లోపాలు లేకుండా కాపాడుతుంది. ఇంకా రక్తపోటును తగ్గించడమే కాకుండా హృద్రోగ వ్యాధులను దరిచేరనివ్వదు. అలాగే బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది. ఒబేసిటీని కూడా దరిచేరనివ్వదు అని ఆరోగ్య నిపుణులు  తెలియజేస్తున్నారు.

 వేసవిలో ఎక్కువగా  వేడి ఉండడం వల్ల  శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. అందుకే వేసవికాలంలో రోజుకు 4 కప్పులు అయినా పుచ్చకాయ ముక్కలు తినడం మంచిది. రక్తంలో నీటి శాతం తగ్గడం వల్ల ప్రసరణ మెరుగ్గా ఉండదు. అలాంటి సమయంలో పుచ్చ కాయలు తినడం వల్ల నీటి  శాతం పెరిగి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

 వేసవికాలంలో శరీరానికి కావలసిన ఐరన్, విటమిన్లు, ఫాస్పరస్, క్యాల్షియం వంటి దాతువులు పుచ్చకాయలో ఉన్నాయి. అందుకే వేసవికాలంలో పుచ్చ కాయలు తినడం మంచిది. ఇవన్నీ ఎరుపు భాగంలోనే కాకుండా, తెలుపు భాగంలో కూడా ఉంటాయి.

 పుచ్చకాయ కాకుండా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ   విత్తనాలు తినడం వల్ల  రక్తంలో ని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా పుచ్చకాయ విత్తనాలు తినడం వల్ల బీపీ తగ్గుతుంది. ఇంకా అలసట తగ్గడమే కాకుండా కండరాలు దృఢంగా ఉండడానికి విత్తనాలు బాగా ఉపయోగపడతాయి.

 పుచ్చకాయ  విత్తనాల పొడిని అర టీ స్పూన్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కంటి చూపు మెరుగు పరచడానికి మంచి మందులా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: