ఉసిరికాయల వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే వున్నాయి. వైద్యపరంగా ఉసిరికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం వంటివి కూడా ఉసిరిలో అధికంగా లభ్యమవుతాయి. ఉసిరిని క్రమం తప్పకుండా వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజూ ఉసిరికాయను తీసుకుంటే ఇంజెక్షన్ వేసుకునే అవసరం ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉసిరికాయ జ్యూస్ లో పటిక బెల్లం కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరికాయలతో చేసిన ఆమ్లా మురబ్బ తింటే వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదర సంబంధిత సమస్యలకు ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉసిరికాయతో చేసిన మాత్రలను తీసుకోవడం వల్ల వాత, కఫ, పిత రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి.


ఉసిరికాయలను ఉపయోగించడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్న పొందవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది. షాంపుల తయారీలోనూ, తలకు రాసే నూనెల తయారీలోనూ, జుట్టుకు వేసుకునే రంగుల తయారీలోనూ ఉసిరికాయలను ఉపయోగిస్తున్నారు. మలబద్దకానికి ఉసిరికాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. ఉసిరికాయ నుండి తీసిన నూనెను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. తలనొప్పి, తలభారాన్ని తగ్గించి మెదడుకు చల్లదనాన్ని అందించడంలో ఉసిరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా జరిపిన పరిశోధనల్లో ఉసిరి జ్యూస్ ను తాగడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని , దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గవచ్చని వెల్లడైంది. ఉసిరికాయను తినడం వల్ల దేహానికి శక్తి లభిస్తుందని, దాహంగా ఉన్నప్పుడు ఉసిరికాయను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే దాహం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: