చాలా మందికి కూడా పొట్ట, పిరుదులు, తొడలు వంటి శరీర భాగాల్లో కొవ్వు చాలా ఎక్కువగా పేరుకుపోయి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. కొంతమంది బరువు తక్కువగా ఉన్నప్పటికి ఆ భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయి చూడడానికి అంద వికారంగా కనబడతారు.బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల డైటింగ్ లను చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అలాగే బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని కూడా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం.అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ శ్రమతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కేవలం మూడు రకాల పదార్థాలతో ఒక మిశ్రమాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. అధిక బరువును తగ్గించే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో అర చెక్క నిమ్మకాయను తీసుకుని ముక్కలుగా చేసి వేయాలి.ఆ తరువాత అందులో రెండు ఇంచుల అల్లం ముక్కను బాగా శుభ్రపరిచి ముక్కలుగా చేసి వేయాలి. ఈ నీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆ తరువాత ఇందులో 25 నుండి 30 పుదీనా ఆకులను వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె మీద మూతను ఉంచి నీరు గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. గోరు వెచ్చగా అయిన తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కోసం దీనిలో ఒక టీ స్పూన్ తేనెను వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట , పిరుదులు, తొడలు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి సన్నగా ఇంకా అలాగే చాలా నాజుకుగా తయారవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: