
సాధారణంగా మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి స్వెటర్లు, దుప్పట్లు కప్పుకుంటాము.అలాగే కాఫీ టీ లను ఎక్కువగా తాగుతుంటాము. కానీ వాటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. మన ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతో చేసుకునే మసాలా టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఈ మసాలా టీ కోసం కావలసినవి సుగంధద్రవ్యాలు..
ఒక స్పూన్ బ్లాక్ టీ పౌడర్,అరలీటర్ నీరు, ఒక చిన్నముక్క దాల్చిన చెక్క,3యాలకులు,2లవంగాలు,అరస్ఫూన్ అల్లం మిశ్రమం తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా మరిగించాలి. ఆ గిన్నెలోని నీరు అరలీటర్ అయ్యేవరకు మరిగించి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో అరకప్పు బెల్లాన్ని వేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి.దీనిని రోజూ ఉదయం, సాయంత్రం కాఫీ టీ బదులుగా త్రాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
ఈ మసాలా టీ తరుచు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన వేడిని అందించి, ఎముకలు కొరికే చలిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అంతే కాక ఈ సీజన్ లో రోగాలతో పోరాడటానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.దీని వల్ల ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటివి రోగాలను దరి చేరనివ్వదు.మధుమేహులు మసాలా టి తాగడం వల్ల ఇందులో వున్న యాంటీ-డయాబెటిక్ గుణాలు వారి రక్తంలోని షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఆయుర్వేద గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఇది శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.ఇందులో వాడే దాల్చినచెక్క హార్మోన్స్ ని క్రమభద్దికరిస్తుంది. కావున బెల్లం కలిపిన మసాలా టి తాగడం అలవాటు చేసుకోండి.