ఈ రోజుల్లో మసాలాలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం ఇంకా అలాగే జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి  కారణాల వలన ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి.అయితే మనలో చాలా మంది కూడా ఈ ఎసిడిటి సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఎసిడిటీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కడుపులో ఇంకా అలాగే ప్రేగులల్లో అల్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.పైగా ఇది క్రమంగా క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంది.అయితే కొన్ని రకాల హెల్తీ టిప్స్ పాటించడం వల్ల మనం ఎసిడిటీ సమస్యను న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ టిప్ ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎసిడిటీ సమస్యను మనం శాశ్వతంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఎసిడిటీ సమస్యను తగ్గించే టిప్స్ ఏమిటి..వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  ఒక గ్లాస్ నీటిలో 20 ఎమ్ ఎల్ కాచీ చల్లర్చిన పాలు, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ టిప్ వాడడం వల్ల చాలా మంచి ఉపశమనం కలుగుతుంది.


ఇక ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు భోజనం చేసిన తరువాత ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే ఎసిడిటీ సమస్యను తగ్గించే మరో టిప్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం పసుపును, నల్ల ఉప్పును, జీలకర్ర ఇంకా అలాగే నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జీలకర్రను వేయించి బాగా పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు ఇంకా అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి కలపాలి. తరువాత ఒక అర చెక్క నిమ్మకాయను అర సెకన్ పాటు నేరుగా మంటపై అలాగే వేడి చేయాలి.ఆ నిమ్మకాయ వేడయ్యాక దాని నుండి రసాన్ని తీసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాగాలి. ఈ టిప్ పాటించడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఈ టిప్ పాటించడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపులో మంట ఇంకా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: