
సామాన్యులు అయితే ఇలా సర్జరీల జోలికి పోవడం లేదు. కానీ అటు సెలబ్రిటీలు మాత్రం ఎక్కువగా తమ శరీరంలో తమకు నచ్చిన భాగాలను నచ్చిన విధంగా మార్చుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సర్జరీ చేయించుకుంటున్నారు. ఇంకొంతమంది బరువు తగ్గడం కోసం నాజుగ్గా కనిపించడానికి కాస్మోటిక్ సర్జరీల వైపే మొగ్గు చూపుతున్నారు అని చెప్పాలి. కానీ ఇలాంటి సర్జరీల కారణంగా ఒక కొత్త వ్యాధి వస్తుంది అన్న విషయాన్ని ఇటీవల వైద్యులు తెలిపారు. అందం కోసం బరువు తగ్గడానికి చేయించుకునే కాస్మోటిక్ సర్జరీలతో ఫంగల్ మీనింజైటీస్ వ్యాధులు పెరుగుతున్నాయి.
ఇటీవలే యూఎస్ లో ఇద్దరూ లైఫో సెక్షన్ చేయించుకోగా.. మీనింజైటీస్ తో వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 25 మందికి కూడా ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే చర్మం దిగువన ఉన్న కొవ్వును తీసే క్రమంలో ఫంగస్ శరీరంలోకి చొరబడి ఇక కణాలను ఉబ్బి పోయేలా చేస్తుండటం.. ఫలితంగా ఇలా సర్జరీలు చేసుకున్న వారు కేవలం తక్కువ సమయంలోనే చివరికి ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎవరు కూడా ఇలాంటి సర్జరీల జోలికి పోవద్దు అంటూ సూచిస్తున్నారు వైద్యులు.