వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా మామిడి పండ్లు వంటివి తినడానికే మక్కువ చూపుతూ ఉంటారు ప్రజలు.. అందుకే వీటిని పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. తినడానికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్లు అందిస్తాయి పచ్చిగా ఉన్న మాగిన కూడా ఈ మామిడి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. మామిడికాయలను పచ్చళ్ళు పప్పు, కూరలుగా కూడా చేసుకుంటూ ఉంటారు. చాలామంది పండిన మామిడికాయలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే నిపుణులు తెలుపుతున్న ప్రకారం మాగిన మామిడిపండు కంటే పచ్చికాయలను తినడమే మంచిదని తెలియజేస్తున్నారు.



మామిడి పండులో విటమిన్ సి.. పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమి-E ,కాపర్ ,ఫోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని సైతం పెంచడానికి సహాయపడతాయి.. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల విరోచనాలు, మలబద్ధక సమస్యలను కూడా తగ్గిస్తాయట. అప్పుడప్పుడు మామిడి పండ్లను తినడం వల్ల గుండె పనితీరును కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. వీటి వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట.


వేసవికాలంలో పండిన మామిడిపండు పచ్చిగా తినడమే మంచిది. ముఖ్యంగా గర్భవతులు పచ్చి మామిడిపండ్లు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది వాంతులు వికారం అరికట్టడంలో చాలా ఉపయోగపడతాయి.. వేసవికాలంలో ఎదురయ్యే వడదెబ్బ భయానికి కూడా పచ్చి మామిడిపండ్లు చాలా ఉపయోగపడుతుంది. మన శరీరంలో వేడిని సైతం తగ్గించడానికి పచ్చి మామిడిపండ్లు తినడం మంచిది. మామిడి పండుని డైరెక్ట్ గా తినకుండా కాస్త ఉప్పు కారంపొడి చల్లుకొని తినడం వల్ల మరింత టేస్ట్ గా అనిపిస్తుంది.


శరీరంలో ఉండే ఐరన్, సోడియం, క్లోరైడ్ వంటి ఖనిజాలను సైతం వృధా కాకుండా మామిడిపండు అరికడుతుంది. ఎవరైనా నీరసంతో ఉండేవారు వారంలో ఒక్కసారైనా మామిడిపండును తినడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. మాగిన మామిడి పండు కంటే పచ్చి మామిడిపండుకి ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: