మాయదారి మహమ్మారి కరోనా మళ్లీ ఇండియాను వణికిస్తుంది. సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతూ వస్తుంది ఈ కరోనా. ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి ఎక్కువ  సంఖ్యలోనే దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి . ఈ క్రమంలోనే కరోనా గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది . కొన్ని స్టేట్స్ కఠిన నియమాలను పాటిస్తుంది . మరీ ముఖ్యంగా ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడం ప్రజలకి వణుకు పుట్టిస్తుంది. కరోనా  కారణంగా ఏపీ ఎంత నష్టపోయిందో ఎన్ని ఒడిదుడుకులు ఎదురుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


కరోనా మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు జనాభా . మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఏపీని భారీ దెబ్బ కొట్టింది కరోనా . అయితే మరొకసారి కొత్త వేరియంట్ తో ఏపీలో తన పాగా వేయడానికి రెడీ అయిపోయింది కరోనా . విశాఖపట్నంలో అదేవిధంగా కడపలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . అంతేకాదు కొంతమంది జలుబు - దగ్గు - జ్వరం లక్షణాలతో హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతున్నారు.  ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనిపై స్పెషల్గా కేర్ తీసుకుంది . ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్స్  ఏర్పాటు చేస్తుంది. కోవిడ్ రాపిడ్ పరీక్షలలో పాజిటివ్గా వస్తే వెంటనే వారు క్వారైంతైన్ అయిపోవాలి అని తెలియజేస్తుంది .



అంతే కాదు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి అంటూ మైకుల్లో అనౌన్స్ చేస్తుంది.  మాస్కులు కచ్చితంగా ధరించాలి అంటూ సామాజిక దూరం పాటించాలి అంటూ వైద్యులు అధికారులు సూచిస్తున్నారు.  ఇప్పటికే వైజాగ్ - కడపలో  పాజిటివ్గా రావడం పైగా మిగతా జిల్లాలలో కూడా జలుబు - దగ్గు - జ్వరం ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో చంద్రబాబు కోవిడ్ పై మరింత ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాలల్లో మీటింగ్ లు జరపకూడదు అని ..ఎక్కడా కూడా గుంపుగా జనాలు తిరగకూడదు అని జలుబు - దగ్గు లక్షణాలు ఉంటే వాళ్లకి దూరంగా ఉండాలి అని.. ఎవరికి వాళ్ళు జలుబు - దగ్గు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండిపోతే పక్కవాళ్ళకి అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ ఏపీలో ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చంద్రబాబు ఎక్కడికక్కడ కోవిడ్స్ అంటారు ఏర్పాటు చేసేస్తున్నారు.  చిన్నపాటి జలుబు - దగ్గు ఉన్నా సరే వాటికి తగిన మందులు ఫ్రీగానే ఇవ్వాలి అంటూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో చంద్రబాబు  కోవిడ్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: