నేటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు పనుల్లో పడి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పిల్లల గురించి పట్టించుకోని ఇలా చేయండి. ఇక పిల్లలు వాళ్ళ యొక్క సమస్యలని వాళ్ళు పరిష్కారం చేసుకునేలా చూడాలి. పిల్లలకు ఏమైనా కాస్త సమస్యలు వస్తే వాళ్లు దాని నుండి బయటికి వచ్చేలా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే లాగ మీరు చూస్తుండాలి. మీరు మాత్రం అసలు చెయ్యి పట్టుకుని నడిపించద్దు. దీని వల్ల వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు. మీరు కాస్త ఓపికగా ఎదురు చూడండి. సమయం ఎక్కువ తీసుకుంటున్నారా పర్వాలేదు. వాళ్లు నేర్చుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్లు కూడా భవిష్యత్తులో మంచి బాటపడతారు.

అయితే మీరు కావాలంటే కాసేపు దారి చూపించండి, వెలుగు ఇవ్వండి. అంతే కానీ వాళ్లని చెయ్యి పట్టుకుని మీరు అస్సలు నడిపించడం ఇది అస్సలు మంచిది కాదు. వాళ్లకి ఇప్పుడు అలవాటైతే జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మీరు మంచి బాట వేయాలి.

మీరు అస్తమానం మీ పనులు మీరు చేసుకోవడం... పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు అని మీరు అనుకోవద్దు. వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులు ఇవ్వండి. ఇలా చెప్పడం వల్ల వాళ్లు కూడా నేర్చుకోవాలి. ఇది కూడా నిజంగా బాధ్యతలు నేర్పుతాయి. వాళ్లతో కనుక మీరు పనులు చేయించారు అంటే తప్పకుండా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మంచిగా పని చేయడం, సమయ పాలన, లీడర్షిప్ గుణాలు ఇలా మీరు పనుల్లో వాళ్లకి తెలియజేయవచ్చు.

ఇక అదే విధంగా వాళ్ళలో మంచితత్వం ఉండేటట్టు మీరు వాళ్లకి అనేక విషయాలు చెబుతూ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పే మాటలు వినకపోవచ్చు. అలానే వాళ్లని ఉండనివ్వండి. వాళ్ళు ఫీలింగ్స్‌ని కూడా మీరు గౌరవించండి. వాళ్లు చెప్పేది కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్లు చెప్పే మాటలు వినడం చేస్తే వాళ్లు కూడా ఆలోచించడం మొదలు పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: