చాలామంది నోటి దుర్వాస‌న సమ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. ఇది ఎదుటువాళ్లు చెప్పేవ‌ర‌కు నోటి దుర్వాస‌న‌తో బాధ‌ప‌డుతున్న‌వాళ్ల‌కు తెలియ‌లేదు. అయితే నోటి దుర్వాస‌న అనేది చాలా అవ‌మానాల‌ను తెస్తుంది. మ‌నలోని ప‌రిశుభ్ర‌త లేమికి అదే నిద‌ర్శ‌న‌మ‌ని ఎదుటివాళ్లు కామెంట్ చేస్తుంటారు. వాస్త‌వానికి నోటి దుర్వాస‌న అనేది అనేక కార‌ణాల‌తో సంక్ర‌మిస్తుంది.  వ్య‌క్తుల ఆహార‌పు అల‌వాట్లు, వ్య‌క్తిగ‌త నోటిశుభ్ర‌త‌ను పాటించ‌క‌పోవ‌డమే ప్ర‌ధాన కార‌ణాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

అయితే కొద్దిపాటి శ్ర‌ద్ధ జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. నోటి దుర్వాస‌న‌కు ప్ర‌ధా కార‌ణాలు  రోజూ నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం, దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు, నోటిలో పుండ్లు, రోజూ ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు ఎక్కువగా తినడం, మద్యపానం, ధూమపానం, అసిడిటీ, సైనస్‌ ఇన్ఫెక్షన్ వంటి చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుంది. అయితే  రోజూ నిద్ర లేవగానే, పడుకోబోయే ముందు పళ్లు తోముకోవ‌డం ద్వారా దుర్వాస‌న‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు. 

 

అలాగే భోజనం చేసిన ప్రతిసారీ నోరు నీటితో బాగా పుక్కిలించాలి. బ్ర‌ష్ చేసిన త‌ర్వాత టంగ్ క్లీన‌ర్‌తో నాలుక పైన శుభ్రం చేసి వదిలేయకుండా, వేలితో చిగుళ్లు, నాలుక పక్క, దిగువ భాగాల్ని శుభ్రం చేసుకోవాలి. విరిగిన దంతాలు, పిప్పి పళ్ళు, చిగుళ్లపై పుళ్లు ఉంటే డెంటిస్ట్ స‌ల‌హాలు పాటించాల్సి ఉంటుంది. నోరు శుద్ధి చేయడానికి లాలాజలము అవసరమవుతుంది. నీరు ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డం కూడా నోటి దుర్వాస‌న‌కు కార‌ణ‌మ‌వుతుంది. 

 

నోరు పొడిపొడిగా ఉంచుకునే వారిలో చెడు శ్వాస ఎక్కువ‌గా ఉంటుద‌ట‌.  అంతేకాక నీరు త‌క్కువ‌గా తాగే వారి నోటిలో బ్యాక్టీరియా పెరుగుదల సంభవిస్తుంద‌ని, తొంద‌ర‌గా జ‌బ్బు ప‌డుతుంటార‌ని చెబుతున్నారు. నోటి శుభ్ర‌త మ‌న ఆరోగ్యానికి సూచిక‌ని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. నోరు బాగుంటేనే మ‌నం ఏదైనా తిన‌గ‌లం...నోటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండ‌టం ఉత్త‌మ‌మ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: