జీవితంలో చాలా మందికి డబ్బు సంపాదన ఓ ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ఇందుకు మనుషుల్ని తప్పుబట్టలేం. ఎందుకంటే ఉదయం లేస్తే డబ్బు లేకుండా ఏ పనీ జరగడం లేదు. డబ్బు సంపాదన తప్పనిసరి వ్యాపకంగా మారింది. మరి అలాంటి సమయంలో డబ్బు సంపాదనను తప్పుగా భావించలేం.

 

 

కాకపోతే.. ఈ సంపాదన ఎంత వరకూ.. ఎన్ని త్యాగాల వరకూ అన్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే.. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యం పాడుచేసుకుంటే.. ఆ తర్వాత ఎంత డబ్బు వెచ్చించినా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం.

 

 

ఓ ప్రముఖ కంపెనీ సీఈవో చెప్పిన మాటలు ఇందుకు ఉదాహరణ.. ఆయన ఏమంటాడంటే.. ”రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది. నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు. బాగా డబ్బు సంపాదించవచ్చు..

 

 

కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు.. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే "జీవితం". అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: