ఉద్యోగానికి వెళ్లేవారు చాలామంది షిఫ్టులు వైజ్ గా ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఎప్పుడు ఓకే షిఫ్టుల్లో పని చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రతిరోజు వేరే వేరే షిఫ్టులు వెళ్లాల్సి ఉంటుంది. వారానికి ఒక  ఒక షిఫ్ట్ చేంజ్  చేస్తూ ఉంటారు కంపెనీ యాజమాన్యం. అయితే షిఫ్ట్ లలో  డ్యూటీలు చేయడం ద్వారా ఎంతో సమయం మిగులుతుందని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ వెళ్లిన వాళ్ళందరూ.. పగలంతా తమకు ఎంతో కాళీ టైం దొరుకుతుంది అని ఏదైనా పని చేసుకోవచ్చు అని అనుకుంటారు. ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లు చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. మిగతా షిఫ్ట్ ల  కంటే నైట్ షిఫ్ట్ లు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు నేటితరం జనాలు. 

 

 

 అయితే తరచూ నైట్ డ్యూటీలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నప్పటికీ నైట్ డ్యూటీల వైపే  ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే రాత్రివేళ డ్యూటీ లో నిర్వహించే వారితోపాటు వారానికొకసారైనా షిఫ్టుల్లో పని చేసేవారిలో జీవన గడియారం గాడి తప్పి గుండె సమస్యలు డయాబెటిస్ వంటి వంటివి దాడి చేసే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి నిద్రలేమి కారణంగా... జీవన గడియారం గాడి తప్పుతుంది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 

 

 దీని ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయి అని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా బిపి షుగర్ భారీగా పెరిగిపోతుండడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది అంటూ ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే... మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నైట్ డ్యూటీలు వెళ్లే వారు సరైన నిద్ర తో పాటు ఆహార నియమాలు సరిగా పాటించడం.. ప్రతిరోజూ తగిన వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: