కొబ్బరితో ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు.. మినరల్స్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొబ్బరి ని తినడంచేస్తారు.. పాయసం, కేక్, కొన్ని రకాల కూరల్లో కూడా కొబ్బరిని వాడతారు. ఉగాది స్పెషల్ స్వామికి నైవేద్యంగా పెట్టాలని అనుకునేవారు.. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయతో రుచీకరమైన బర్ఫీ ను తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ ను చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. స్పెషల్ గా ఉండాలి అనుకునేవారు దీనిని ట్రై చేయండి.. ఈ స్వీట్ కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో నేర్చుకుందాం..
కావలసిన పదార్థాలు..
మైదా: కప్పు,
కొబ్బరిపాలు: నాలుగుకప్పులు,
చక్కెర: రెండు కప్పులు,
జీడిపప్పు పలుకులు: కొన్ని,
నెయ్యి: పావుకప్పు.
తయారీవిధానం..
ముందుగా.. మైదాను ఓ గిన్నె లో వేసి నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. దాంట్లోనే మరో మూడు కప్పుల నీళ్లు పోసి చేత్తో కలుపుతూ ఉంటే పిండినీళ్లు పైకి తేలతాయి. ఇలా పిండి అంతా
నీటి లో కలిసిపోయే వరకూ కలపాలి.. మూత పెడితే మర్నాటికి పల్చని నీరు పైకి తేలుతుంది. ఆ నీటిని వడకట్టి చిక్కని మైదా మిశ్రమాన్ని మరో గిన్నె లో తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద
కడాయి పెట్టి మైదా మిశ్రమం, కొబ్బరిపాలు, పావు వంతు చక్కెర వేసి అన్నింటినీ కలిపి స్టౌని మీడియం లో పెట్టాలి. మరో
బాణలి లో మిగిలిన చక్కెర, నెయ్యివేసి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు దాన్ని మైదా మిశ్రమం లో వేసి మధ్యమధ్య లో నెమ్మదిగా కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గర పడుతుంది. అప్పుడు జీడిపప్పు పలుకులు వేసి ఓసారి కలిపి
నెయ్యి రాసిన ప్లేటు లో పరిచి, వేడి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోసుకోవాలి.. మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.. ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి.