మన దేశంలో ప్రతిభకు కొదువ లేదు.. మన దేశంలో కళలకు కొదవు లేదు.. కళాకారులకు, సృజనకు మన భారతావనిలో ఎప్పడూ కొరత లేదు. కానీ.. కావాల్సిందల్లా.. ఆ కళలకు, కళాసృష్టికి తగిన మార్కెటింగ్ సదుపాయాలు.. తగిన డిమాండ్ మాత్రమే.. కానీ.. ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికత ఈ సమస్యను పరిష్కరిస్తోంది. పెరిగిన టెక్నాలజీ, సోషల్ మీడియా సదుపాయాలు ఎందరినో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రపంచంలోని ఎక్కడెక్కడో ఉండేవారిని కలుపుతున్నాయి.


ఇలాంటి కళా సృజనలకు తగిన మార్కెటింగ్ కల్పించేందుకు.. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. 'మేడిన్ తెలంగాణ మాల్ యాప్ అనే యాప్ ద్వారా చేతివృత్తుల కళాకారులను ఆదుకునేందుకు నడుంబిగించింది. వారి కోసం ప్రత్యేకంగా 'మేడిన్ తెలంగాణ మాల్ యాప్' రూపొందించింది. 'మేడ్‌ ఇన్ తెలంగాణ మాల్' యాప్‌ రూపొందించిన ప్రభుత్వం..  చేతివృత్తి కళాకారులకు చేయూత ఇచ్చేందుకు  ప్రయత్నిస్తోంది.


ఈ మేడిన్ తెలంగాణ యాప్‌ ద్వారా గ్లోబల్ లింకర్స్ భాగస్వామ్యం కల్పిస్తోంది. అలా సాయం పొందేలా ఈ మాల్‌ యాప్‌ రూపకల్పన జరిగింది. ఈ యాప్ ద్వారా హస్త కళాకృతుల ప్రదర్శనకు అవకాశం లభిస్తోంది. అక్కడే విక్రయానికి అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా  హస్తకళల వస్తువులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సరికొత్త యాప్ త్వరలోనే తెలంగాణ కళాకారులకు అందుబాటులోకి రాబోతోంది.


జనవరి నుంచి ఈ మేడిన్ తెలంగాణ మాల్ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ఏ హస్తకళాకారుడైనా.. తగినంత డిమాండ్ వచ్చిన తర్వాత వస్తువులు తయారు చేసే అవకాశం ఉంటుంది. మధ్యలో దళారుల బెడద తగ్గుతుంది. ఆన్ లైన్ మార్కెటింగ్ సదుపాయాలు బాగా పెరిగిన నేపథ్యంలో హస్త కళలకు కూడా మార్కెటింగ్ కల్పించాలన్న తెలంగాణ సర్కారు ఆలోచన మెచ్చుకోదగిందే. ఈ యాప్ ద్వారా కళాకారులకు ఆర్డర్లు పెరిగి.. తగినంత ఆదాయం వస్తే అదే పది వేలు.. ఈ ప్రయత్నాని మాత్ర్ం మెచ్చుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: