ఎన్నో ఏళ్ల క్రితం మహిళలు కేవలం వంటింటికీ మాత్రమే పరిమితం అయ్యేవారు. కనీసం ఇంట్లో కాలు బయట పెట్టడానికి కూడా మహిళలకు అనుమతి ఉండేది కాదు. మహిళలు అంటే కేవలం ఇంటి యజమానికి కట్టు బానిసలు అన్నట్లుగానే ఉండేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రతి ఒక్కరూ మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం క్రమక్రమంగా ఇక మహిళలు సాధికారత వైపు అడుగులు వేస్తూ ఉండడం జరుగుతుంది అనే విషయం తెలిసిందే  నేటి రోజుల్లో అయితే పురుషులు మహిళలు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. కొన్ని రంగాలలో అయితే పురుషులతో సమానంగానే కాదు పురుషుల కంటే ఎక్కువగానే రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు మేము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ సభ్యసమాజం ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇలా నేటి రోజుల్లో మగవాళ్లు గొప్ప ఆడవాళ్లు కాదు అనే పదం ఎక్కడ వినిపించడం లేదు.  అయితే మహిళా సాధికారత అన్వేషణలో మహిళలు ఎంత ముందడుగు వేశారు అన్న విషయంలో  ఇటీవల ఒక సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.


 మహిళలు ఇంకా కొన్ని విషయాల్లో పురుషులతో వెనుకబడే ఉన్నారు అన్న విషయాన్ని ఇటీవల సర్వే నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 66.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అయితే ఇందులో 54 శాతం మందికి మహిళలు మాత్రమే సొంత ఫోన్లు కలిగి ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో ఈ విషయం వెల్లడైంది. మహిళా సాధికారత అన్వేషణలో భాగంగా 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసు కలిగిన ఏడు లక్షల 24 వేల 115 మంది మహిళలపై సర్వే నిర్వహించగా ఉపాధి సంపాదన పై నియంత్రణ మొబైల్ వినియోగం విషయంలో పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. దీనిలో 71 శాతం మంది కి టెక్స్ట్ మెసేజ్ కూడా అర్థంచేసుకోలేని స్థితిలో ఉన్నారు. మొబైల్ వినియోగంలో గోవా టాప్ లో ఉండగా మధ్యప్రదేశ్ చివర్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: