
నిద్రలో ఉన్నప్పుడు కాలిని పైకి ఎత్తితే ఇలా జరుగుతూ ఉంటుంది. దీంతో ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుందట ఇలా చాలామందికి తరచూ జరుగుతూనే ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.అయితే నిద్రలో ఉన్నప్పుడే కాకుండా చాలామందికి పగటి కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.. అయితే ఇందుకు కారణం మెగ్నీషియం లోపమే అన్నట్లుగా తెలియజేస్తున్నారు వైద్యులు. మెగ్నీషియం లోపించడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందట. దీంతో ఎక్కువసేపు కూర్చోలేరు, నిలబడలేరు, తిమ్మిర్లు వంటివి వస్తూ ఉంటాయట. అలాగే రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడి నరాల మీద తీవ్రమైన ఒత్తిడి పడేలా చేస్తాయి.
దీంతో అలాంటి సమయంలోనే పిక్కలు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటుంది.. ఈ నొప్పులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ బర్నర్ తో తిక్కడం వల్ల దీని వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందట.అలాగే రాత్రి సమయాలలో పనుకునేటప్పుడు కాళ్ళ కింద దిండ్లు ఎత్తుగా పెట్టుకొని పడుకోవాలట.కాళ్లు బాగా చాచి అటు ఇటు కదుపుతూ ఉదయం పూట కాస్త వ్యాయామం చేయడం వల్ల వీటి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలను తినడం చాలా మంచిది. ముఖ్యంగా పాలకూర గుమ్మడి విత్తనాలు బాదంపప్పు పెరుగు ఆకుకూరలు వంటివి తినడం మంచిదట.