ఇక కీళ్ల నొప్పులు అలాగే మోకాళ్ల నొప్పుల వల్ల కలిగే బాధ అసలు అంతా ఇంతా కాదు. ఈ నొప్పుల వల్ల కనీసం వారి పనిని కూడా వారు చేసుకోలేకపోతుంటారు. ఇంకా అంతేగాక సరిగ్గా నడవలేక కూర్చోలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇంకా అలాగే నొప్పుల కారణంగా అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. చాలా మంది కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందడానికి ఎక్కువగా ఇంట్లో పెయిన్ కిల్లర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉన్నప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఇక ఈ కీళ్ల నొప్పులను కేవలం రెండే రెండు పదార్థాలను వాడి చాలా సహజసిద్దంగా మనం తగ్గించుకోవచ్చు.ఇక కీళ్ల నొప్పులను తగ్గించే ఆ రెండు పదార్థాలు ఏమిటి…అలాగే వీటిని ఎలా  వాడాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఆవ నూనె ఇంకా బిర్యానీ ఆకు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆవనూనెలో ఉండే ఔషధ గుణాలు నొప్పిని తగ్గించడంలో చాలా ఈజీగా సహాయపడతాయి.ఇంకా అలాగే బిర్యానీ ఆకును మనం చాలా రకాలుగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం.


ఈ బిర్యానీ ఆకులో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను ఇంకా వాపులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఆవనూనెతో ఇంకా అలాగే బిర్యానీ ఆకులతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ ఆవ నూనెను తీసుకుని బాగా వేడి చేయాలి. ఇంకా అలాగే ఇందులోనే 5 బిర్యానీ ఆకులను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ ఆకులను ఎర్రగా అయ్యే దాకా చిన్న మంటపై వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ నూనెను వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఇలా తయారు చేసుకున్న నూనెను తీసుకొని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తూ నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. మీరు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ టిప్ పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: