మనలో చాలా మందిని కూడా దంత సమస్యలు ఎంతగానో వేధిస్తుంటాయి. ముఖ్యంగా దంతాలు పచ్చగా ఉండడం లేదా గార పట్టి ఉండడం అనేది చాలా మందిని కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టె సమస్యలు. ఈ సమస్యలు ఉన్నవారు నలుగురితో అస్సలు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేరు.అలాగే మనస్ఫూర్తిగా కూడా నవ్వలేరు.ఎందుకంటే దంతాలపై ఉండే గార వల్ల ఎదుటివారిలో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల దంతాలను తెల్లగా మార్చుకోవాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం అవసరం లేకున్నా ఎక్కువ బ్రష్ చేయడం ఇంకా రకరకాల బ్రేష్ లు వాడడం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా పచ్చగా ఉన్న దంతాలను లేదా గార పట్టిన దంతాలను చాలా ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బేకింగ్ సోడా గురించి మనందరికి తెలుసు. మన వంటింట్లో వివిధ ఆహార పదార్థాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఇంకా అలాగే చర్మ సౌందర్యన్ని పెంచే మెడిసన్స్ లో కూడా ఈ బేకింగ్ సోడాని వాడుతూ ఉంటారు. ఈ బేకింగ్ సోడా పంటి గార ను ఈజీగా పోగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఒక స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని, అందులో మరోస్పూన్ నిమ్మరసంని కలిపి ఆ మిశ్రమాన్ని మీ దంతాలకు రుద్దితే పంటిపై ఉండే గార పసుపు రంగు ఈజీగా పోయి.. మీ దంతాలు ఈజీగా తెల్లగా మారతాయి.అలాగే తులసి ఆకులను తీసుకొని వాటిని ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకొని ప్రతిరోజూ ఉదయం పూట బ్రేష్ చేసేటప్పుడు పేస్ట్ తో పాటు ఆ పొడిని కలుపుకొని మీరు రుద్దితే ఎలాంటి దంత సమస్యలైన కూడా చాలా ఈజీగా దురమౌతాయి.ఇంకా అలాగే పంటిపై ఉండే పాచి, గార వంటివి ఈజీగా పోయి దంతాలు మంచి తెలుపుదనాన్ని సొంతం చేసుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: