
ఈ అక్రమ సంబంధం అనే దాన్ని వివాహేతర సంబంధం గా పిలవమని ఈమధ్య కోర్టు చెప్పిందట. అయితే ఈ వివాహేతర సంబంధం వలన ఆయా వ్యక్తులకి పుట్టిన పిల్లలకు ఆయా వ్యక్తుల పూర్వీకుల ఆస్తులు వర్తిస్తాయా అనే విషయం మీద చర్చ నడిచిన తర్వాత శుక్రవారం సుప్రీంకోర్టులో తీర్పును రిజర్వులో ఉంచడం జరిగింది. ఈ విషయంపై 2011 నుండి పెండింగ్ లో ఉన్న అభ్యర్థన పై తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలువురు న్యాయవాదుల వాదనలను పరిశీలించింది.
తాజాగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 63 ప్రకారం ఇలా వివాహేతర సంబంధం వలన పుట్టిన పిల్లలకు పూర్వీకుల ఆస్తి నుండి కాకుండా ఇటువంటి సంబంధం పెట్టుకున్న తల్లిదండ్రుల స్వీయ ఆస్తి నుండి వాటా దక్కుతుందని కోర్టు వెల్లడించింది. చెల్లుబాటు కానీ లేదా రద్దు చేయదగిన వివాహల ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తుల్లో హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది.
అయితే అలాంటి సంతతికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తులతో సంబంధం ఉండదని గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. మన సమాజంతో పాటు ఇతర సమాజంలోని నిబంధనలు అన్ని మారుతున్నాయి. గతంలో చట్ట విరుద్ధమైనది ఇప్పుడు చట్టబద్ధం కావచ్చు. మారుతున్న సమాజంలో చట్టం మారకుండా ఉండిపోకూడదని న్యాయ కోవిదులు కూడా చెప్తున్న మాట. ఇది భారతదేశ భవిష్యత్ చరిత్రనే మార్చబోయే విషయం అని అంటున్నారు.