ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా షుగర్‌తో బాధపడుతున్నారు. అయితే దీన్ని అరికట్టడం కూడా మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.నిజానికి షుగర్ రెండు రకాలుగా ఉంటుంది.అందులో ఒకటి టైప్ 1 డయాబెటీస్ అయితే రెండవది టైప్ 2 డయాబెటీస్.అయితే మన లైఫ్ స్టైల్‎ను బట్టే మన ఆరోగ్యం అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది రాత్రివేళ సోషల్ మీడియాతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు.అందువల్ల త్వరగా నిద్రపోవడం లేదు. దాని ఫలితంగా.. ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట 8.30 AM గంటల్లోగా బ్రేక్ ఫాస్ట్‌ను పూర్తి చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని చెబుతున్నారు. అయితే ఇలా జరగాలంటే ఖచ్చితంగా రాత్రిపూట తొందరగా నిద్రపోయి ఉదయాన్నే తొందరగా లేవాలి. అయితే ఇందుకు సంబంధించి 10,575 మందిపై శాంపిల్స్ తీసుకొని ఓ అధ్యయనం చేయడం జరిగింది.


ఇక ఉదయం 8.30 AM గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసిన వారిలో షుగరు లెవల్స్ కంట్రోల్‎లో ఉంటాయని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఆ సమయంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని వారు గుర్తించారు. ఇంకా అంతేకాదు తినే టిఫిన్‎లో కూడా కొవ్వు, ప్రొటీన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా ప్రతిరోజూ కనుక చేస్తే రక్తంలో బ్లడ్ షుగరు లెవల్ తగ్గుతుందని అంటున్నారు.అసలు కొంతమంది అయితే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్టు చేయరు. వారు ఒకేసారి మధ్యాహ్నం పూట భోజనం చేసేస్తుంటారు. అయితే ఇది అసలు మంచి అలవాటు కాదని మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా పలు రోగాలు తలెత్తుతాయని, ఉదయం పూట టిఫిన్ గట్టిగా తిని..మధ్యాహ్నం పూట, రాత్రి భోజనం తగ్గించాలని చెబుతున్నారు. ఇంకా అలాగే నిద్ర కూడా 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: