కీర దోస ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలిసే ఉంటుంది. కీర దోస తినడం వల్ల ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఉబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్య ఔషధముగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో కీరదోస ఒకటి. కీర దోసలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్లా తింటుంటారు. కిరా దోస ఉపయోగాలను తెలుసుకుందాం. కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడే వారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 అంతేకాదు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడంలో కీరా దోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిలవను తగ్గించి షుగర్ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు కేరా తినాలని సూచిస్తున్నారు. కీర దోసకాయలు మెగ్నీషియం, జింక్, పాస్ ప్రెస్, ఐరన్ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీర దోసలో క్యాన్సర్ ను నిరోధించే గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్ ను తగ్గించి రక్త ప్రసన్న సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉండటం వల్ల వేసవిలో శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది.

దీనిలో ఉండే విటమిన్ బి తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కీర దోసను జ్యూస్గా చేసుకునే తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. కీర దోసలు పుష్కలమైన నీటి పరిమాణంలో ఉంది. శరీరానికి తేమను అందించడంలో సహాయపడతాయి. ఇది శరీరానికి మంచి హైడ్రేషన్ ను ఇస్తుంది. కీర దోసకాయ తినడం ద్వారా శరీర ద్రవ సమతుల్యత బాగుంటుంది. కణాల పనితీరు మెరుగు పడుతుంది. కీర దోసకాయలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం శోషలను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. కిరా దోసకాయ తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. కీర దోసకాయలో నీరు, ఫైబర్ రెండు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడంలో సహాయపడుతాయి. ఫైబర్ మలాన్ని సమృద్ధిగా చేస్తుంది. క్రమం తప్పకుండా పేగు కదలికలు జరగడం ద్వారా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: