
మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి UTI వచ్చే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి UTI వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూత్ర మార్గంలో అడ్డంకులు ఉంటే, మూత్రం నిలిచిపోయి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
మూత్ర మార్గంలో కెథెటర్‌లు ఉపయోగించడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు పోయే అవకాశాలు ఉంటాయి. మూత్ర విసర్జన కోసం ఎక్కువసేపు ఆగకుండా, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడం మేలు చేస్తుందని చెప్పవచ్చు. లైంగిక సంపర్కం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల బ్యాక్టీరియాను బయటకు పంపే అవకాశం ఉంటుంది.
లైంగిక అవయవాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని కచ్చితంగా చెప్పవచ్చు. డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక, మూత్రంలో రక్తం లేదా మబ్బుగా ఉండటం, తక్కువ పొత్తి కడుపులో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందేనని చెప్పవచ్చు. మందులు, ఇంజెక్షన్ల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టె ఛాన్స్ అయితే ఉంది.