పచ్చి బొప్పాయి తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని సంగతి తెలిసిందే. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు మలబద్ధకాన్నీ నివారిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

  ఉబ్బరం, మలబద్ధకం మరియు అజీర్ణం వంటి సమస్యలకు పచ్చి  బొప్పాయితో ఈజీగా  చెక్ పెట్టవచ్చు.  పచ్చి బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి అదే సమయంలో ఇందులో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  పచ్చి బొప్పాయిలో ఉండే పీచు, పొటాషియం, మరియు విటమిన్లు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు.

 పచ్చి బొప్పాయిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచడంలో సహాయపడుతుంది.  పచ్చి బొప్పాయిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడే ఛాన్స్  అయితే ఉంటుంది.  మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను  సులువుగా తగ్గించే ఛాన్స్ అయితే  ఉంటుందని చెప్పవచ్చు.

పచ్చి బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే అవకాశాలు ఉంటాయి.  ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.  పచ్చి బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు పచ్చి  బొప్పయికి  వీలైనంత దూరంగా ఉంటె మంచిది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: