
బాడీలోని చెడు కొవ్వు కరిగేలా సహాయం చేస్తుంది. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఉదయాన్నే 1 గ్లాస్ గోరువెచ్చటి నీటిలో అరకప్పు దాల్చిన చెక్క ముక్కలు వేసి 10 నిమిషాలు మరిగించి తాగాలి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్కను ప్రతిరోజూ తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తక్కువవుతాయి. వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. చలులు, జలుబు, గొంతు నొప్పికి ఇది సహజ ఔషధం, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. హార్ట్ అటాక్, హై బీపీ వంటి సమస్యలు నివారించవచ్చు. ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
దాల్చిన చెక్క తినడం వల్ల మెదడుకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. మూడ్ స్టెబిలైజర్‌గా పని చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి మొటిమలు, మచ్చలు తగ్గించడానికి దాల్చిన చెక్క పేస్టు ఉపయోగించవచ్చు. జుట్టుకు దాల్చిన చెక్క నూనె వాడితే జుట్టు పెరుగుదల బాగా జరుగుతుంది. అధికంగా దాల్చిన చెక్క తీసుకోవద్దు రోజుకు 1-2 గ్రాములు చాలును. గర్భిణులు, శిశువులు వైద్యుల సలహాతో మాత్రమే వినియోగించాలి. లివర్ సంబంధిత సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి.