
జీడిపప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బోణీ డ్రైఫ్రూట్స్. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండటంతో సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి శక్తిని అందించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. అయితే ఎక్కువగా తీసుకుంటే కాబోయే దుష్ప్రభావాలూ ఉన్నాయి. జీడిపప్పుల్లో ఉండే ముఖ్య పోషకాలు, 100 గ్రాముల జీడిపప్పుల్లో సుమారు, కేలరీలు: 550–580 kcal ఫ్యాట్ కొవ్వు: 44–46 గ్రాములు మంచి కొవ్వులు ఎక్కువ. ప్రోటీన్: 15–18 గ్రాములు. ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం, కాపర్, జింక్, ఐరన్ వంటి ఖనిజాలూ ఉంటాయి. ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, రోజుకు 4–6 జీడిపప్పులు మాత్రమే తినడం ఉత్తమం.
జీడిపప్పుల్లో అధికంగా కేలరీలు ఉండటం వల్ల అధికంగా తింటే బరువు పెరగడం మొదలవుతుంది. మంచికొవ్వులే అయినా అధిక పరిమాణంలో తీసుకుంటే కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు కలిగించే అవకాశం ఉంది. ప్రొటీన్లు, ఖనిజాలు సరిపడిన మోతాదులో ఉంటాయి పరిమితంగా తింటే రోజువారీ అవసరాలను తీరుస్తాయి. 4–5 జీడిపప్పులను నానబెట్టి తినడం శరీరానికి శక్తిని అందిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. టీ లేదా కాఫీ టైమ్‌లో 3–4 జీడిపప్పులతో పాటు బాదం, వాల్‌నట్స్ కలిపి తింటే అధిక శక్తిని పొందవచ్చు. మెగ్నీషియం, కాపర్ ఎక్కువగా ఉండటంతో ఎముకల బలానికి దోహదం చేస్తాయి. ఒమేగా–6 ఫ్యాటీ ఆసిడ్లు మెదడుకు అవసరమైన పోషణను అందిస్తాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ E, కాపర్ వల్ల చర్మానికి మెరుపు, జుట్టుకి బలాన్ని ఇస్తుంది. హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది. మంచి కొవ్వులు గుండెకు రక్షణ ఇస్తాయి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. జీడిపప్పుల్లో ఐరన్ ఉండటంతో రక్త హీమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియపై ప్రభావం చూపవచ్చు. కొంతమందికి జీడిపప్పులపై అలర్జీ ఉండొచ్చు. శ్వాస లోపం, చర్మం ఎర్రబడటం, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో లభించే క్యారమలైజ్డ్ లేదా ఉప్పు వేసిన జీడిపప్పులు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.