
చల్లారిన తర్వాత వడకట్టి తాగాలి. వేపాకులో హైపోగ్లైసెమిక్ గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. 10–15 కరివేపాకు ఆకులు నీటితో బ్లెండ్ చేసి తాగాలి. ఇన్సులిన్ సంభందిత పనితీరును మెరుగుపరుస్తుంది. షుగర్ శరీరంలో నిల్వ కాకుండా అడ్డుకుంటుంది. గోరువెచ్చిన నీటిలో ఒక చిటికెడు పసుపు మరియు నిమ్మరసం కలిపి తాగాలి. క్రొమోనిన్స్ అనే పదార్థం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రెండు పచ్చి లసూన్ల ముక్కలను మెదపి, 1 గ్లాస్ గోరువెచ్చిన నీటిలో వేసి తాగాలి. లసూన్ గ్లూకోజ్ మెటబోలిజాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తనాళాల్లో శుద్ధి జరిపి ఇన్సులిన్ శక్తిని పెంచుతుంది. తాజా కాకరకాయను తురిమి, ఆరచేసి రసం తాగాలి. లేదా మిక్సీలో వేసి రసం తీసుకోవచ్చు. "చారంటిన్" అనే పదార్థం గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సహజ ఇన్సులిన్ లా పనిచేస్తుంది. జవగం నీటిని మరిగించి వడకట్టి తాగాలి. గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. ఉదయం పూట చక్కెర కలిపిన టీ, కాఫీ, ఫ్రూట్ జ్యూస్ (ప్రాసెస్డ్), ఫిజీ డ్రింక్స్ తాగకూడదు. ఇవి రక్తంలో షుగర్‌ను ఒక్కసారిగా పెంచేస్తాయి. ఉదయం 15 నిమిషాలు బ్రిస్క్ వాక్ లేదా ప్రాణాయామం చేయడం వల్ల కూడా షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఒకే సమయానికి ఈ డ్రింక్స్ తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.