తెలంగాణలో ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రాణిస్తున్న వారిలో రసమయి బాల కిషన్ ఒకరు..ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రసమయి...ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే గాయకుడుగా, కవిగా తనలో ఉన్న కళలని బయటపెట్టారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు..తన పాటల ద్వారా తెలంగాణ కోసం పోరాడారు. ఇలా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రసమయిని కేసీఆర్ దగ్గరకు తీసుకున్నారు...టీఆర్ఎస్‌లో చేర్చుకుని 2014లో మానకొండూరు సీటు ఇచ్చారు...ఆ ఎన్నికల్లో తొలిసారి రసమయి ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్‌పై విజయం సాధించారు..ఇక 2018 ఎన్నికల్లో కూడా మరోసారి రసమయి మానకొండూరు సీటు దక్కించుకుని...మళ్ళీ ఆరేపల్లి మోహన్‌ని మట్టికరిపించారు..ఇలా రెండు సార్లు రసమయి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే బాలకిషన్‌కు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ పదవి కూడా దక్కింది. ఇక ఎమ్మెల్యే అయిన సరే తన కళని మాత్రం రసమయి పక్కన పెట్టకుండా ఇప్పటికీ పాటలలతో ప్రజలని ఆలోచిపజేస్తూనే ఉన్నారు...అసెంబ్లీలో సైతం అప్పుడప్పుడు తన గళంతో అందరినీ మెప్పిస్తారు.

అయితే పాటలతో మెప్పిస్తున్నారు గాని పనితో మాత్రం మానకొండూరు ప్రజలని మెప్పిస్తున్నట్లు కనిపించడం లేదు...రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరే..అక్కడ ఉండే సమస్యలకు చెక్ పెట్టడంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కూడా అంతంత మాత్రమే...రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు ఈయన సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాను ఓ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నానని, తాను ఏమి మాట్లాడలేని పరిస్తితిలో ఉండటం వల్ల చాలామందికి దూరమయ్యాయని రసమయి బాధపడిన సందర్భాలు ఉన్నాయి.


అలాగే ప్రశ్నించినందుకు ఓ యువకుడుని బండ బూతులు తిట్టి వివాదాల్లో చిక్కుకున్న సందర్భం కూడా ఉంది. ఇక మానకొండూరులో సరైన ప్రత్యర్ధి లేకపోవడం రసమయికి కలిసొచ్చే అంశం...ఇంకోసారి గాని ఆయనకు సీటు వస్తే..మళ్ళీ మానకొండూరులో పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి:

trs