క్రీడా రంగంలో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న గుత్తా జ్వాలా గురించి అందరికీ తెలిసిందే.  తన సహ క్రీడాకారుడు చేతన్ ని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.  గుత్తా జ్వాల ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాది నటుడు విష్ణు విశాల్ తో తాను డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగా వారిద్దరి మధ్య విరహం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల దిన పత్రికతో జ్వాలా గుత్తా మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వివరంగా చెప్పింది.  అయితే ఆ మధ్య వీరిద్దరూ ముద్దు పెట్టుకునే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై తనను ప్రశ్నించగా నా డేటింగ్ నా ఇష్టం అని సమాధానం ఇచ్చింది.

 

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉంటుంది జ్వాలా తమిళనాడులో ఉంటున్న విష్ణు విశాల్‌ ను మిస్ అవుతున్న అంటూ తన   సోషల్ పోస్ట్ లో విష్ణు తో కలిసి దిగ్గిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తెలియజేసింది. షూటింగుల బిజీతో ఆయన చెన్నైలో, నా అకాడమీ పనులతో నేను హైదరాబాద్‌లో బిజీగా ఉన్నాను. ఎప్పుడంటే అప్పుడు కలుసుకొనే అవకాశం ఉండేది అని గుత్తా జ్వాలా అన్నారు.

 

మాది అందరి మాదిరిగా, సినిమాల్లో చూపించిన విధంగా టీనేజ్ లవ్ కాదు. మేమిద్దరం పరిణితి చెందిన వ్యక్తులం. విష్ణు విశాల్ సైతం కాస్ట్యూమ్ డిజైనర్ రజనీని పెళ్లాడి, ఆ తర్వాత విడిపోయారు. ఈ విషయంపై విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. గుత్తా జ్వాలతో ప్రేమ వ్యవహారం కారణంగానే తన కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరిగిందని, వాస్తవానికి రజనీతో విడాకుల తర్వాతే తనకు గుత్తా జ్వాల పరిచయం అయిందని స్పష్టం చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: