టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ రోజు ఉదయం డాక్టర్ పల్లవి వర్మతో వివాహం జరిగింది. ఉద‌యం 6.31 నిమిషాల‌కు తాను ప్రేమించిన ప్రియసఖిని మూడు ముళ్ల బంధంతో ముడి వేసుకున్నాడు. షామీర్‌ పేట్‌ లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ ప‌ల్ల‌విల పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ లో జరగాల్సిన వీరి వివాహం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ కరోనా ప్రభావం తగ్గి మాములు పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడం.. అందులోనూ ఇప్పట్లో శుభ ముహుర్తాలు లేకపోవడంతో పెళ్లి చేసుకోడానికి నిశ్చయించుకున్నాడు. దీనికి పల్లవి వర్మ కుటుంబం కూడా ఓకే చెప్పడంతో మే 14న శుభ ముహార్తానికి పెళ్లి ఫిక్స్ చేశారు. అభిమానుల మధ్యలో ఎంతో కోలాహలంగా.. గ్రాండ్ గా చేసుకోవాలనుకున్న వివాహం చాలా సింపుల్ గా చేసుకుంటున్నారు. 

 

నిఖిల్ - పల్లవి వర్మ పెళ్లి వేడుకను కేవలం కొందరు సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారని తెలుస్తోంది. పోలీసుల అనుమతి తీసుకొని పూర్తి  నిబంధ‌న‌లు భౌతిక దూరం పాటిస్తూ కొద్దిమంది సమక్షంలో వివాహ వేడుక జరిపించారు. నిఖిల్ - పల్లవి వర్మకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈరోజు పెద్దలు నిశ్చయించిన సుముహార్తానికి వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్ళికి సంభందించిన వీడియోలు ఫోటోలు బయటకి వచ్చాయి. వీరిలో నిఖిల్ - పల్లవి వర్మలు తలంబ్రాలు చల్లుకుంటూ ఆనందంగా కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో నిఖిల్ పెళ్లి వీడియోలు షేర్ అవుతున్నాయి. కానీ వాటిలో ఓ ఫోటో మాత్రం నెటిజన్స్ ను ఒక్కసారిగా ఆకర్షించింది. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు తమ వెడ్డింగ్ బోర్డులో పెట్టిన చిన్న క్రేజీ థాట్ వైరల్ అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే “మాస్క్ లు ఇక్కడున్నాయ్, శానిటైజర్లు అక్కడున్నాయ్, ప్రేమ అన్ని చోట్లా ఉంది” అంటూ వారి పెళ్లి ప్రాంగణానికి వచ్చిన వారికి చిన్న చిరునవ్వు వచ్చేలా చేసారు. దీనితో ఈ ఫోటో నెటిజన్స్ నిఖిల్ క్రేజీ థాట్ బాగుంది అని అంటున్నారు. ఇకపై అన్ని వివాహాలకు ఇదే ఫాలో అవుతారేమో. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: