కింగ్... నాగార్జున కెరీర్ లో వచ్చిన భారీ సినిమా ఇది. భారీ అంచనాలతోనే కాదు భారీ బడ్జెట్ తో కూడా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న కథ నుంచి సినిమాలో ఉన్న కొన్ని కొన్ని కోణాలు... ఇక ఈ సినిమాలో చూపించిన వ్యక్తులు అన్నీ కూడా కాస్త రిచ్ గా ఉంటాయి. ఎక్కువగా రిచ్ గా లేకపోయినా ఓకే అప్పుడు ఉన్న ఆలోచనల ప్రకారం అది రిచ్. ఇక సినిమాను ఇతర రాష్ట్రాల్లో షూట్ చేయడం తో అప్పుడు ఖర్చు కూడా భారీగానే అయింది అని అంటారు జనాలు. ఇక ఈ సినిమా భారీ అంచనాల కంటే అంతకు మించి వచ్చింది. కాని జనాలను మాత్రం పెద్ద స్క్రీన్ మీద ఏ మాత్రం మెప్పించలేదు. 

 

సినిమా కథ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దర్శక నిర్మాతల నుంచి ప్రతీ ఒక్కరు తీసుకుని ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది అని అంటారు. కాని ఆ ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా హాల్ లో కంటే టీవీ లో వస్తేనే ఎక్కువగా చూసారు జనాలు అనే సంగతి తెలిసిందే. సినిమాను హాల్ లో పెద్దగా చూడటానికి ఆసక్తి చూపించని జనాలు సినిమా టీవీ లో వస్తే మాత్రం దాని కామెడి ఏ మాత్రం కూడా మిస్ అవకుండా చూస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. 

 

బ్రాహ్మి కామెడి తో పాటుగా సినిమాలో శ్రీహరి నుంచి వచ్చిన కామేడి కూడా జనాలకు బాగానే నచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత నాగార్జున కూడా కొన్ని కొన్ని కథల విషయంలో భయపడ్డారు అని చెప్తూ ఉంటారు. ఆయన చాలా వరకు  జాగ్రత్త పడే కథలను ఓకే చేసారు అనేది జనాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: