నట సింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ హై వోల్టేజ్ మూవీ "అఖండ". వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " సింహా " లెజెండ్ " వంటి సినిమాలు అదిరిపోయే విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తుంది చిత్రయూనిట్.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి పొలిటీషియన్ పాత్ర కాగా, మరొకటి అఘోరా పాత్ర. ఇక ఈ రెండు పాత్రలకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన టిజర్స్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా బాలయ్య అఘోర పాత్రకు సంబంధించిన టీజర్ కు అశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ వ్యూస్ పరంగాను, లైక్స్ పరంగాను సరికొత్త రికార్డులను నెలకొల్పింది.. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో బోయపాటి బాలయ్యను నెవర్ బిఫోర్ రేంజ్ లో చూపించబోతున్నాడట.

ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్య ఎంట్రీ సీన్ ఎంతో పవర్ ఫుల్ గా తెరకెక్కించాడట బోయపాటి.. ఎంట్రీ సీన్ కోసమే దాదాపు 5కోట్లు వెచ్చించారని సమాచారం. ఎంతో గ్రాండ్ గా ఉండే బాలయ్య ఎంట్రీ ఎపిషోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. అదే విధంగా ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న శ్రీకాంత్ క్యారెక్టర్ ను కూడా సరికొత్తగా డిజైన్ చేశాడట బోయపాటి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం " వినయ విధేయ రామ " సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు తీవ్ర విమర్శలు కూడా ఎదురయ్యాయి. దీంతో బోయపాటి ఆ చేదు జ్ఞాపకాన్ని మరిపించేలా " అఖండ " తో భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఈ నెల 28 న విడుదల చేయాలని భావించినప్పటికి కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. మరి బాలయ్య- బోయపాటి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: