పవన్ కళ్యాణ్ స్పీడు మామూలుగా లేదు అని చెప్పవచ్చు. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈ సంవత్సరం బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ 'పింక్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'వకీల్ సాబ్' సినిమాతో తో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించి , కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళం సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనున్ కోషియన్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'భీమ్లా నాయక్' సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మధ్యే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు.

 ఈ పాట విడుదలైనప్పటి నుండి అనేక రికార్డులను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డును సాధించింది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డులోకేక్కింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్రబృందం 'భీమ్లా నాయక్' నుంచి మరో పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హుషారెత్తించింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించిన తీరు శ్రోతలను ఆకట్టుకుంటుంది. దానితో ఈ పాట యూ ట్యూబ్ వ్యూస్ లో ముందుకు దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమాలు నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: