అఖిల్ తొలి విజయాన్ని పొందాడు. గత మూడు సినిమాలుగా ఆయన ఏ విజయం విషయంలో అయితే నిరాశ పడుతున్నాడో అలాంటి విజయం ఇప్పుడు ఆయనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో తగిలిందని అందరూ అంటున్నారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అనడంతో అక్కినేని అఖిల్ కు తొలి హిట్ పడింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా మొదటి నుంచి చిత్ర యూనిట్ ఈ చిత్రంపై మంచి నమ్మకాన్ని పెట్టుకుంది.

ఆ నమ్మకానికి తగ్గట్లుగా సినిమా ఉండటంతో ప్రేక్షకులు కూడా దీన్ని సూపర్ హిట్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం అక్కినేని అఖిల్ హీరోయిజం, హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ కలగలిపి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదటి నుంచి బొమ్మరిల్లు భాస్కర్ లో ఉన్న టాలెంట్ ఇదే. నిజమైన బాంధవ్యాల లో ఉండే చిన్న చిన్న ఎమోషన్స్ ను ఆయన పసిగట్టి సినిమా రూపంలో దాన్ని బయటకు తీసుకు వస్తాడు. 

నిజ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉంటాయో అలాంటి ఎమోషన్ ను కళ్లకు కట్టినట్లుగా సినిమాలో చూపించడంలో ఆయన దిట్ట. బొమ్మరిల్లు సినిమా విషయంలో ఇది ఇప్పటికే నిరూపితమయింది కూడా. ఈ సినిమా లో కూడా అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ ను చూపించడంతో వారు వాటికి బాగా కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ చేశారు. మరి ఈ సినిమా ముందు ముందు ఎన్ని రికార్డులు సాధిస్తుందో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూద్దాం. ఇకపోతే ఈ సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ కావడానికి కారణం గోపీసుందర్ సంగీతం అని కూడా చెప్పవచ్చు ఆమె సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా లోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండడంతో ప్రతి సీన్ కు కనెక్ట్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: