గతంలో ఒకానొక సమయంలో వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అయిన రవితేజ. ఇప్పుడు సరైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. కాగా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఖిలాడీ' రేపు గ్రాండ్ గా అని థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ఇప్పటికే సిద్ధమయ్యింది. ఈ సినిమాకు అంచనాలు కూడా భారీ గానే ఉన్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్ కూడా పక్కాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే... స్టార్ హీరో రవితేజ ఖిలాడీ సినిమాకి పోటీగా నిలిచే పెద్ద సినిమాలైతే దగ్గర్లో లేవు. ఇది నిజంగా ఒక రకంగా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

రేపు శుక్రవారం 11 వ తేదీన ఈ సినిమాతో పాటుగా మరికొన్ని చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రేస్ కు దిగనున్నాయి. అయితే వాటిలో పెద్ద స్టార్ల చిత్రాలు లేకపోవడం విశేషం . అంతే కాకుండా దగ్గర్లో కూడా పెద్ద చిత్రాలు లేకపోవడంతో అన్ని విధాలుగా ఈ రిలీజ్ పీరియడ్ ఖిలాడీ మూవీకి బాగా కలిసొచ్చేలా ఉంది. హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఖాయం అనిపిస్తోంది. అదీకాక ఖిలాడీ మూవీపై ఇప్పటికే హిట్ టాక్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. సందిట్లో సడేమియా అన్నట్లుగా టికెట్ల పెంపు పంచాయితీ కూడా శుభదాయకంగా ముగిసింది. అయితే కంటెంట్ బాగుంటేనే ఇవన్నీ అడిషనల్ గా వర్కౌట్ అవుతాయి అన్నది అక్షర సత్యం.

మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక మొదటి రివ్యూ వస్తే గానీ ఒక అంచనాకు రాలేమనే చెప్పాలి. ఇపుడు ఫిబ్రవరి 11 న శుక్రవారం నేడు ఖిలాడీ సినిమాతో పాటుగా రిలీజ్ కు సిద్దమయిన చిత్రాలేంటో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు అయితే సినిమాకు సంబంధించిన పాటలు, రవితేజ, మీనాక్షి చౌదరి లు ఈ సినిమాకు ప్లస్ అవుతారని చిత్ర బృందం మరియు రవి తేజ ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: