టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించగా కీరవాణి సంగీతాన్ని సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని రాసారు. అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించగా అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ, ఛత్రపతి శేఖర్, రాజీవ్ కనకాల వంటి వారు కీలక పాత్రలు చేసారు.

ఇక నాలుగు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆశించిన స్థాయిలో టాక్ అయితే లభించలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కొమురం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అత్యద్భుతంగా యాక్టింగ్ కనబరిచిన ఈ సినిమాని జక్కన్న ఊహించిన స్థాయిలో తీయలేదని, కథనంలో పలు చోట్ల లోపాలు ఉన్నాయని పలువురు ప్రేక్షకాభిమానులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఇటువంటి టాక్ తో సైతం సినిమా బాగానే కలెక్షన్స్ రాబడుతున్నప్పటికీ మూవీ ఓవరాల్ గా గతంలో జక్కన్న తీసిన బాహుబలి సినిమాల స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందా లేదా అనేది ప్రస్తుతం అందరిలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.

ముఖ్యంగా బాహుబలి 2 మూవీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని రాబట్టగా ప్రస్తుతం రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ ఆ రేంజ్ ని అందుకోవడం చాలావరకు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ మూవీ రూ. 500 కోట్ల మార్క్ వరకు అందుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో మరొక రూ. 1300 కోట్ల పైచిలుకు కలెక్షన్ అంటే అసాధ్యం అని, కాకపోతే ఫైనల్ గా మాత్రం రూ. 1000 కోట్ల మార్క్ పక్కాగా దాటుతుందని అంటున్నారు. కాగా ఫైనల్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత మేర కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: