టాలీవుడ్ యంగ్ హీరో యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా,ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు.ఇక అలాగే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో,ఇంకా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఇక ఈ సినిమా నుండి ''రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ'' అనే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇంకా ఈ మాస్ సాంగ్ రిలీజ్‌ను జాతరలా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 


ఇక ఈ మాస్ జాతరను శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్‌లో జూలై 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా ఇక ఈ మాస్ సాంగ్‌లో హీరో నితిన్‌తో పాటు అందాల భామ అంజలి స్టెప్పులు వేసేందుకు రెడీ అయ్యింది. గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోనూ అంజలి హాట్ గా ఓ ఐటెం సాంగ్ చేయగా, అది పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ మరో ఐటెం సాంగ్ చేస్తుండటంతో ఇక తెలుగు ప్రేక్షకుల చూపులు ఈ పాటపై పడ్డాయి. మరి మాచర్ల నియోజకవర్గం మాస్ జాతరకు శ్రీకాకుళంలో ఎలాంటి రెస్పాన్స్ అనేది దక్కుతుందో ఇక చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి ఇంకా కేథరిన్ థెరిస్సా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: