నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం థాంక్యూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాలో రాశీ కన్నా హీరోయిన్ గా నటించగా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ఇప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఈ ఆల్బమ్ లోని మూడు పాటలను చిత్ర బృందం విడుదల చేసింది.  తమన్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకులలో మంచి స్పందన దక్కుతుంది. ముఖ్యంగా ఫేర్వెల్ సాంగ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అలా తమన్ మరొకసారి తన మ్యాజిక్ ని ప్రదర్శించి ఈ సినిమా కు ఇంతటి క్రేజీ రావటంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఇకపోతే ఇంటర్వ్యూ లతో ఈ సినిమా బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా తాజాగా మీడియాతో చిట్ చాట్ చేశారు. సినిమా టైటిల్ లో చెప్పినట్లుగా మన జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి మనం థాంక్స్ చెప్పాలి అని వారు వెల్లడించారు. కథానాయకుడు నాగచైతన్య కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు అని కృతజ్ఞతా పత్రాన్ని పోస్ట్ చేశాడు. 

ఎప్పటికప్పుడు తనను తాను నిర్మించుకుంటూ పోతున్న విధానాన్ని దానికి సహకరించిన అందరికీ థాంక్స్ అని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ ప్రయాణంలో తనకు స్నేహితుడిగా అండగా ఉన్నందుకు తన తండ్రి అక్కినేని నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా జూలై 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. మాళవిక నాయక్ అవికా గోర్ వంటి హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో నటించారు బివిఎస్ రవి ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.  మరి లవ్ స్టోరీ లాంటి భారీ హిట్ తర్వాత ఈ హీరో చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: