టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ఇప్పుడు ఫేడ్ ఔట్ దశలో ఉంది. పెద్ద హీరోలు సినిమాల అవకాశాలు ఇవ్వడం లేదు.. చిన్న హీరోల సరసన ఆమె నటించడానికి ఇష్టపడటం లేదు.. దాంతో సీనియర్ హీరోల సరసన నటిస్తూ తన కెరియర్ను నెట్టుకు వస్తుంది. మధ్యలో కొన్ని సార్లు ఐటెం సాంగ్లు చేస్తూ వెబ్ సిరీస్లు చేస్తూ ఇంకా ఆమె సినిమా పరిశ్రమలో కొనసాగుతూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఆమె చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే యేడాది వేసవికి విడుదల చేయాలన్న సంకల్పంతో చెప్పారు.

 ఇతర ప్రాజెక్టులు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ వేసవికి దీనిని వాయిదా వేశారట. ఈ నేపథ్యంలో ఇది అందరికంటే ఎక్కువగా తమన్నా నే బాధిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా తనకు అవకాశాలు రావడం ఖాయం అని భావిచింది. ఇందులో తన పాత్ర కూడా బాగా ఉండటంతో ఈ సినిమా విడుదల ఈ సినిమాల వేట ప్రారంభించాలి అనుకుంది. కానీ ఈ సినిమా వాయిదా పడినట్లుగానే తో ఆమె అవకాశాలు కూడా ఇప్పుడు వాయిదా పడిందని చెప్పాలి. ఏదేమైనా అన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడడం కూడా ఎంతో నిరాశ పరుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి దసరా కానుక విడుదల చేస్తుంటే బాబీ దర్శకత్వంలోని సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిరు భావిస్తున్నారు.

 అందుకే బోలో శంకర్ చిత్రాన్ని వేసేవికి విడుదల చేయాలని చూస్తున్నారు ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలు తో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి ఇప్పటికే ఆచార్య సినిమాతో భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మంచి కం బ్యాక్ చేయాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: