బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న లేడీ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఫైమాకు అంతే స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్లో 16వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఫైమా మొదటి నుంచి తన మార్క్ చూపిస్తోంది. ఫైమా కామారెడ్డి లోని దోమల కొండలో జన్మించింది . తనది నిరుపేద కుటుంబం.. సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి వాచ్మెన్ కాగా తల్లి బీడీలు చుడుతూ ఉంటుంది. ఇక ఫైమా కి ముగ్గురు అక్కలు కాగా వాళ్లంతా కష్టపడి ఫైమాను చదివించారట. అయితే వాళ్లు ఈమెను అబ్బాయిలాగే పెంచారట.



ఒకరోజు పటాస్ షో కి స్టూడెంట్స్ స్పెషల్ లో భాగంగా వాళ్ళ కాలేజీ వాళ్ళు తీసుకొచ్చారట. ఇక అందులో  ఫైమా చలాకితనం, పంచెస్ అన్నీ కూడా బాగా ఉండడంతో యాంకర్ రవి తనను పటాస్ ప్రోగ్రాం లో కామెడీ చేయమని అడిగారట. అలా కొంతకాలం ఆలోచించిన తర్వాత ఒప్పుకున్న ఫైమా అప్పటినుంచి కామెడీ షోస్ లో తన సత్తా చాటుతోంది. ఇక ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కార్యక్రమం పూర్తి అవడంతో జబర్దస్త్ లో అవకాశం వచ్చింది.  ఇక అప్పటినుంచి ఆమె సక్సెస్ మొదలైందని చెప్పవచ్చు.. ఇక తన జీవితంలో అన్నీ కష్టాలే ఉన్నాయని..  సొంత ఇల్లు కూడా లేదని.. ఆ కలను నెరవేర్చుకోవడానికి బిగ్బాస్ హౌస్ లోకి వచ్చానని చెబుతోంది. ఇక హౌస్ లో మొదటి రోజు నుంచి హుషారుగా ఉంటూ తనకంటూ ఒక కామెడీ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. మంచి కామెడీ టైమింగ్ తో హౌస్ లో రాకెట్ లా దూసుకుపోతూ అటు హౌస్ మేట్స్ ని మెప్పిస్తూ.. ఇటు నాగార్జునతో కూడా శభాష్ అనిపించుకుంటూ తనను తాను మరింత మెరుగుపరుచుకుంటుంది.


ఇక ఈమెకు బిగ్ బాస్ లో రోజుకు 20వేల రూపాయలు పారితోషకం ఇస్తున్నారట. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఫైమా చివరికి టైటిల్ విజేతగా నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: