రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభాస్ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మూవీ ల రీ రిలీజ్ ఫ్రెండ్ జోరుగా నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ల సినిమాలను కొన్నింటిని రీ రిలీజ్ చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు.  అందులో భాగంగా ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో దాదాపు 70 ప్లస్ లొకేషన్ లలో విడుదల చేయనున్నారు.  అలా బిల్లా మూవీ రీ రిలీస్ లో కూడా అదరగొడుతుంది. ఇది ఇలా ఉంటే బిల్లా మూవీ 3 ఏప్రిల్ 2009 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.

మూవీ లో ప్రభాస్ మరియు అనుష్క శెట్టి జంటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.  మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ,  రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైలు కి , మాస్ యాక్షన్ సన్నివేశాలకు , డైలాగ్ డెలివరీ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: