తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేపర్ బాయ్ మూవీ తో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న ఈ యువ హీరో , ఆ తర్వాత ఏక్ మినీ కథ మూవీ తో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంశలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా సంతోష్ శోభన్ , మారుతి దర్శకత్వంలో మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేదు. 

ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ శోభన్ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ,  మేర్లపాక గాంధీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ,  ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే  మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన సంతోష్ శోభన్ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: