‘యశోద’ మూవీ సూపర్ సక్సస్ సమంత కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. ప్రస్తుతం ఆమె ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్యలతో పాటు గత సంవత్సరం ఆమె వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల ఆమె పై ఎన్నో నెగిటివ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. వాటిని చాల ఓర్పుగా భరించిన సమంత ‘యశోద’ హిట్ తో తన పై నెగిటివ్ విమర్శలు చేస్తున్న వారికి సరైన సమాధానం ఇచ్చింది.


ఈమె నటించిన ‘శాకుంతలం’ మూవీ కూడ రిలీజ్ కు రెడీగా ఉంది. దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ మార్కెటింగ్ కు ‘యశోద’ సూపర్ హిట్ చాల కలిసి వస్తుంది. ‘యశోద’ మూవీలో ఆమె పాత్రకు సమంత ఆత్మగా పేరు గాంచిన చిన్మయి డబ్బింగ్ చెప్పకుండా సమంత తానే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో చిన్మయి కి సమంత కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా అన్న సందేహాలు కొందరికి కలిగాయి.


అయితే ‘యశోద’ మూవీని చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ విపరీతంగా ప్రమోట్ చేయడంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. ఇప్పుడు సమంత ప్రస్తుతం ఫెయిల్యూర్స్ బాటలో ఉన్న రాహుల్ కు ఒక అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అతడు దర్శకత్వం వహించే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ కథకు సమంత ఓకె చేసినట్లు టాక్. వాస్తవానికి ఈ కథను రాహుల్ ఈమధ్య రస్మిక కు వినిపించాడని ఆకథ రష్మికకు నచ్చలేదని రూమర్స్ వచ్చాయి.


ఇప్పుడు అదే కథను రాహుల్ కొన్ని మార్పులు చేర్పులు చేసి సమంత కు చెప్పడం ఆమె ఓకె చేయడం జరిగిపోయింది అంటున్నారు. నాగార్జునతో ‘మన్మధుడు 2’ మూవీ తీసి ఘోరమైన ఫ్లాప్ ను అందుకున్న రాహుల్ కు ఆతరువాత ఆ ఫ్లాప్ వల్ల అవకాశాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో సమంత రాహుల్ కు అవకాశం ఇవ్వడంతో ఆమె తన స్నేహ బంధాన్ని మరొకసారి చాటుకున్నట్లు అయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: