మహాభారతంలో కర్ణుడు మరణానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఫిలిం ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ మరాణానికి అన్ని కారణాలు వెతకవచ్చు. చిన్న వయసులోనే మూడు బ్లాక్ బష్టర్ హిట్స్ అందుకుని టాప్ హీరో స్థాయికి ఎదిగిపోతాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అతడి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.



ఉదయ్ కిరణ్ కు హీరోగా మొట్టమొదటి అవకాశం ఇచ్చిన తేజా ఉదయ్ కిరణ్ జీవితం గురించి చాల పూర్తిగా తెలిసిన వ్యక్తి అని అంటారు. ఒక సందర్భంలో ఉదయ్ కిరణ్ జీవితం పై ఒక బయోపిక్ తీయాలని తేజా ప్రయత్నాలు చేసినట్లు కూడ వార్తలు వచ్చాయి. అయితే ఆతరువాత ఆ వార్తలు తేజ ఖండించాడు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఒకటివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ మరణం పై తేజ కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేసాడు.



ఉదయ్ కిరణ్ కెరియర్ లో వరసగా మూడు బ్లాక్ బష్టర్స్ అందుకోవడంతో అతడిని గైడ్ చేసే వ్యక్తి లేకపోవడంతో అయోమయానికి లోనై కొన్ని పొరపాట్లు చేసాడని ఆ పొరపాట్లు అతడి వ్యక్తిగత జీవితం పై కూడ ప్రభావం చూపించడంతో వ్యక్తిగా ఉదయ్ కిరణ్ ఎంతో నష్టపోయాడు అని కామెంట్స్ చేసాడు. అంతేకాదు తన మరణానికి ముందు ఉదయ్ కిరణ్ తనను కలిసి తన జీవితంలో జరిగిన విషయాలకు సంబంధించిన యదార్థాలను తనకు చెప్పాడని ఆవిషయాలను సరైన సమయంలో తాను బయటపెడతాను అంటూ తేజా కామెంట్స్ చేసాడు.



దీనితో తేజా కు తెలిసిన ఆవిషయాలు ఏమిటి ఆవిషయాలను తేజా ఎప్పుడు బయటపెడతాడు అన్న ఆశక్తి చాలామందిలో ఉంది. ఇప్పటకే చాలామందిలో ఉదయ్ కిరణ్ మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా తేజా తనకు అన్నీ తెలుసు అని అంటున్న నేపధ్యంలో తేజా ఎప్పుడు ఈవిషయాల పై అన్న ఆశక్తి చాలామందిలో ఉంది..









మరింత సమాచారం తెలుసుకోండి: